Abn logo
Oct 31 2020 @ 16:08PM

చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశా: అల్లు అర్జున్

Kaakateeya

సుహాస్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ `కలర్ ఫొటో`. ఇటీవల `ఆహా` యాప్ ద్వారా విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చింది. కాలభైరవ సంగీతంలోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. 


ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `కలర్ ఫొటో` టీమ్‌ను అభినందించాడు. ఆ సినిమా టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ``కలర్ ఫొటో` టీమ్ మొత్తానికి అభినందనలు. వెరీ స్వీట్ లవ్‌స్టోరీ. చక్కని సంగీతం, అద్భుతమైన నటన, భావోద్వేగాలతో కూడిన చక్కని సినిమా. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసినందుకు సంతోషంగా ఉంద`ని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 


Advertisement
Advertisement