Oct 14 2021 @ 11:54AM

Allu arjun: బోయపాటితో నెక్స్ట్ మూవీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్టు తాజా వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం 'పుష్ప ది రైస్ పార్ట్ 1' ఈ ఏడాది డిసెంబర్ 17న, 5 భాషలలో ప్రపంచవ్యాప్తంగా.. విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' సినిమాను చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ కథను ఇప్పుడు అల్లు అర్జున్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పాన్ ఇండియా రేంజ్‌లో డెవలప్ చేస్తున్నారట. దాంతో ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా సమయం పడుతుండటంతో నెక్స్ట్ బోయపాటితో అల్లు అర్జున్ మూవీ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం ఇంకా వెలువడలేదు. చూడాలి మరి అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో మొదలు పెడతాడో. గతంలో బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'సరైనోడు' వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.