Advertisement

Pushpa the rise : బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం క్రేజీ రూట్లో బన్నీ

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘పుష్ప : ది రైజ్’. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇదివరకు విడుదలైన టీజర్, సింగిల్స్ అభిమానుల్ని ఎంతగానో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఐదో సింగిల్, అలాగే.. ‘పుష్ప’ ట్రైలర్ కూడా రెడీ అవుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోన్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన హిందీ ప్రమోషన్స్‌ను బన్నీ వినూత్న రీతిలో చేయబోతున్నారు. ఏఏ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్న ఈ సినిమా హిందీ వెర్షన్ కు మంచి హైప్ తీసుకొచ్చే  ప్రయత్నంలో ఉన్నారు బన్నీ. 


అందులో భాగంగా సల్లూభాయ్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ వేదికను బన్నీ వాడుకోబోతున్నట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రస్తుతం ‘బిగ్ బాస్’ 15th సీజన్ నడుస్తోంది. ఇందులో బన్నీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాల హిందీ వెర్షన్స్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తెచ్చుకున్నాయి. దీంతో బన్నీ క్రేజ్ బాలీవుడ్ లోనూ ఓ రేంజ్ లో పెరిగింది. ముఖ్యంగా ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని ఒక పాట విషయంలో సల్మాన్ ఖాన్ గతంలో బన్నీకి థాంక్స్ చెప్పారు.ఈ నేపథ్యంలో ‘పుష్ప’ బాలీవుడ్ ప్రమోషన్స్ ను సల్మాన్ ఖాన్ సమక్షంలోనే చెయ్యాలని ‘పుష్ప’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి బన్నీ ప్రెజెన్స్ ‘బిగ్ బాస్ 15’ కు ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి. 

Advertisement
Advertisement