Abn logo
Apr 4 2020 @ 13:15PM

ప్ర‌భాస్ రిలీజ్ డేట్‌పై క‌న్నేసిన బ‌న్నీ

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన‌ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌బోయే సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఆగింది. ఈ సినిమా కోసం బ‌న్నీని సుక్కు స‌రికొత్త లుక్‌లో చూపించ‌బోతున్న సంగ‌తి కూడా విదిత‌మే. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌బోతున్నార‌ని టాక్‌. కాగా.. తాజా స‌మాచారం ప్ర‌కారం, ప్ర‌భాస్‌ను నేష‌న‌ల్ స్టార్‌ను చేసిన బాహుబ‌లి 2 రిలీజ్ డేట్ ఏప్రిల్ 28, 2021న బ‌న్నీ త‌న 20వ సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుక్కు కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement