Aug 3 2021 @ 14:44PM

Allu Arha: ‘శాకుంతలం’ సెట్‌లో సందడి మొదలైంది!

అల్లు అర్జున్‌ గారాలపట్టీ అర్హా బాలనటిగా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే! గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో అల్లు అర్హా ప్రిన్‌ భరత పాత్ర చేయనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అర్హా నేటి నుంచి సెట్‌లో అడుగుపెట్టారు. సెట్‌లో ఈ చిన్నారిని మేకప్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మైథలాజికల్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు.