Abn logo
Jul 10 2020 @ 04:59AM

‘ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇవ్వండి’

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 9: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీవీ సుబ్బయ్య కోరారు. గురువారం డీఈవో సాయిరాంను కలిసి వారు వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సం వత్సరం ఫీజులు సవరించకుండా ఈ విద్యాసంవత్సరంలో కూడా జూన్‌ మాసం నుంచి స్కూల్‌ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఫీజులు, రికార్డు షీట్స్‌ లేకుండా ప్రవేశాలు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. పుస్తకాలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం రూ.20 వేల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలన్నారు. డీఈవోను కలిసిన వారిలో శ్రీఆదిత్య, సర్వేపల్లి, రామకృష్ణ పబ్లిక్‌ పాఠశాలల కర స్పాండెంట్లు వాసుదేవయ్య, శేషన్న, చింతలపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement