Abn logo
Sep 23 2020 @ 00:59AM

మార్చి నాటికి రూర్బన్‌ పనులన్నీ పూర్తిచేయాలి

రాష్ట్ర రూర్బన్‌ జాయింట్‌ కమిషనర్‌ నాగేష్‌


తాండూరు రూరల్‌ : తాండూరు మండల పరిధిలో రూర్బన్‌ పథకం కింద కొనసాగుతున్న పనులన్నీ వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రూర్బన్‌ జాయింట్‌ కమిషనర్‌ నాగేష్‌ ఆదేశించారు. తాండూరు మండలం జినుగుర్తి, అల్లాపూర్‌, అంతారం గ్రామాల్లో రూ.2కోట్ల 51లక్షల 21వేలతో నిర్మిస్తున్న పనులను వికారాబాద్‌ పంచాయతీరాజ్‌ ఈఈ మనోహర్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. జినుగుర్తి గ్రామ సమీపంలోని రూ.2కోట్లతో నిర్మాణం చేపటే ్ట స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనాన్ని పరిశీలించారు. వారం రోజుల్లో భవనాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు అందించేలా చ ర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్‌ కృష్ణయ్య, పంచాయతీ రా జ్‌ అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులను పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న పీఆర్‌ ఈఈ మనోహర్‌ను ఆదేశించారు. సమీపంలోని రూ.6లక్షలతో చేపడుతున్న డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాం పనులను పరిశీలించారు.


అదేవిధంగా రూ.14.30లక్షలతో చేపట్టే రెడ్‌ గ్రామ్‌ స్టోరేజీ పనుల గురించి తెలుసుకున్నారు. అంతారం సమీపంలోని రూ.16లక్షల 60వేలతో చేపట్టే అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అదనపు భవనాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడే రూ.14.30 లక్షలతో చేపట్టే రెడ్‌ గ్రామ్‌ స్టోరేజీ(కందుల నిల్వ కేంద్రం) పనులను పరిశీలించారు. పంచాయతీరాజ్‌ ఈఈ మనోహర్‌, డీఈ వెంకట్‌రావు, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, ఎంపీహెచ్‌వో రతన్‌సింగ్‌, రూర్బన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ వినోద్‌, ఏఈ సంతోష్‌కుమార్‌, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ రాంలింగారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement