Abn logo
Apr 4 2020 @ 10:08AM

పాట‌తో ‘ఆర్ఆర్ఆర్‌’లోకి ఆలియా అడుగు..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). ఇప్పటికే 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. పూణేలో జ‌ర‌గాల్సిన షెడ్యూల్ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో  వాయిదా ప‌డింది. వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ షెడ్యూల్‌ను ప్రారంభించ‌నున్నారు. మే నెల‌లో షెడ్యూల్ జ‌రుగుతుంద‌ని టాక్‌. రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా మ‌ధ్య సాంగ్‌తో షెడ్యూల్‌ను ప్రారంభిస్తార‌ట‌. సాంగ్ త‌ర్వాత కీల‌క స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రిస్తార‌ట‌. ఇంకా ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement