బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం కొద్ది సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంది. వీరి ప్రేమ గురించి, పెళ్లి గురించి జాతీయ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరి గురించి తాజాగా ఓ వార్త వైరల్‌గా మారింది.
ముంబైలోని బాంద్రాలో ఉన్న పాలి హిల్ కాంప్లెక్స్‌లో ఆలియా తాజాగా ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందట. రణబీర్ కూడా అదే పాలి హిల్ కాంప్లెక్స్‌లో 7వ అంతస్తులోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడట. ఇప్పుడు అదే బిల్డింగ్‌లో ఆలియా రూ.32 కోట్లతో ఓ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకుందట. కరణ్ జోహార్ నిర్మిస్తున్న `బ్రహ్మాస్త్ర` చిత్రంలో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.