Alia bhatt : 15 నిమిషాలకోసం రూ.5కోట్లా?

బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆలియా భట్. అమ్మడి క్రేజ్ కు తగ్గట్టే అక్కడ ఆమె పారితోషికం ఉంటుంది. అలాంటి బ్యూటీ ఇప్పుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ జోడీగా సీత పాత్రకోసం ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తించింది. దానికి తగ్గట్టుగానే సినిమాలో ఆమె స్ర్కీన్ ప్రెజెన్స్ మెప్పిస్తోంది. మరి అలాంటి సుందరి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ కోసం ఏ రేంజ్ లో పారితోషికం అందుకుంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ కలుగుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మొత్తం మీద ఆమె కనపించేది కేవలం 15 నిమిషాలు మాత్రమేనట. ఆ మాత్రం దానికే ఆమె షాకింగ్ రెమ్యూనరేషన్ అందుకుందని తెలుస్తోంది.


‘ఆర్.ఆర్.ఆర్’ షూట్ లో కేవలం 10రోజులు మాత్రమే పాల్గొన్న ఆలియా భట్.. దాని కోసం ఏకంగా రూ. 5కోట్లు పారితోషికం అందుకుందని సమాచారం. బాలీవుడ్ లో నెలల తరబడి షూట్స్ లో పాల్గొనే ఆమె .. అక్కడ అందుకొనే పారితోషికం రూ. 10కోట్లు మాత్రమే. అలాంటిది అతి తక్కువ రోజులకి కాల్షీట్స్ ఇచ్చి.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యం అలాంటిదని, దాని కోసం ఆమెకు అంత పారితోషికం ముట్టచెప్పారని టాక్. 

Advertisement
Advertisement