Abn logo
Aug 6 2020 @ 23:39PM

న్యూయార్క్‌లో రాముడి చిత్రపటాల ప్రదర్శనపై స్పందించిన బాలీవుడ్ స్టార్

న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది  హిందువుల చిరకాల కోరిక బుధవారం రోజు సాకారమైంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. కోదండ రాముడి ఆలయ నిర్మాణానికి భూమి చేశారు. ఈ నేపథ్యంలో దేశవిదేశాల్లో ఉన్న హిందువులు సంబరాలు చేసుకున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న హిందువులు.. తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ఉన్న భారీ డిజిటల్ బిల్‌బోర్డ్‌‌పై అయెధ్యలో నూతనంగా నిర్మించబోయే ఆలయం, రాముడి ఫొటోలు ప్రదర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ‘ఈ సంవత్సరం దీపావళి  ముందే వచ్చింది. నిజంగా ఇది చరిత్రాత్మక రోజు. జై శ్రీరామ్’ అంటూ ట్వీట్ చేశారు. 


Advertisement
Advertisement
Advertisement