Abn logo
Mar 6 2021 @ 11:19AM

ఆ సమస్యను అధిగమించిన అక్షర గౌడ

2011లో ‘ఉయిర్‌తిరు 420’ చిత్రం ద్వారా తమిళ వెండితెరకు పరిచయమైన నటి అక్షర గౌడ. ఆ తర్వాత ‘తుపాకి’, ‘ఆరంభం’, ‘ఇరుంబు గుదిరై’, ‘బోగన్‌’, ‘సంగిలి పుంగిలి కదవ తిర’, ‘మాయవన్‌‘ తదితర చిత్రాల్లో నటించింది. తెలుగులో మన్మథుడు 2 మూవీలో నటించింది. అయితే కొద్ది రోజులు మానసిక ఒత్తిడి కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇపుడు మళ్ళీ  రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘తిరువిక్రమ’ అనే కన్నడ చిత్రంలో నటిస్తుంది. అలాగే, ‘శూర్పనగై’ పేరుతో తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమయ్యే చిత్రంలోనూ అక్షర గౌడ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘మిర్చి’ శివతో కలిసి ‘ఇడియట్‌’ అనే మూవీలో నటించేందుకు అంగీకరించింది. ఈ మూవీలో నిక్కీ గల్రానీ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. రంభాలా దర్శకత్వంలో  కామెడీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది. కాగా ఇపుడు ‘శూర్పనగై’ మూవీలో పూర్తిస్థాయి పాత్రలో ఈమె కనిపించనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement