Abn logo
Oct 22 2021 @ 21:53PM

కోనలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు

రాపూరు, అక్టోబరు 22: పెంచలకోనలోని క్షేత్రంలోని 27 సత్రాల నిర్వాహకులు తమకు కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ స్తలాన్ని ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మించుకున్నట్లు పాలకమండలి గుర్తించిం ది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయ అసిస్టెంట్‌ ఇంజనీరు, ఆలయ ఉద్యోగులు సత్రాల కొలతలు సేకరించారు. దీంతో కొన్ని సత్రాల నిర్వాహకుల్లో  అందోళన వ్యక్తమవుతోంది.