Abn logo
Sep 19 2020 @ 15:15PM

ఇదే ఏడాదిలో షురూ చేయాలనుకుంటున్న అఖిల్‌..!

Kaakateeya

అకిల్‌ అక్కినేని ఇప్పుడు 'మోస్ట్‌ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్'‌ షూటింగ్‌తో ఫుల్‌ బిజీ బిజీగా ఉన్నారు. సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ పెండింగ్‌ షూటింగ్‌లో అఖిల్‌, పూజా హెగ్డే పాల్గొంటున్నారు. వారం, పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ ముగుస్తుంది. ఇది ముగియగానే ఇదే ఏడాదిలో తన నెక్ట్స్‌ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ను అఖిల్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అఖిల్‌ తదుపరి చిత్రాన్ని సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్‌ స్క్రిప్ట్‌ను తయారు చేసే పనిలో సురేందర్‌ రెడ్డి బిజీగా ఉన్నారట. మరో వైపు ప్రీ ప్రొడక్షన్‌ వ్యవహారాలను కూడా పూర్తి చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను సురేందర్‌ రెడ్డి తెరకెక్కించనున్నారు. డిసెంబర్‌ నుండి సినిమా సెట్స్‌పైకి వెళుతుందని టాక్‌ వినిపిస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement