Abn logo
Mar 31 2020 @ 15:33PM

అఖిల్ ఇంకొంత కాలం ఆగాల్సిందే!

అఖిల్ అక్కినేని.. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తొలి సినిమా `అఖిల్` తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన `హలో`, `మిస్టర్ మజ్ను` సినిమాలు కూడా అఖిల్‌కు విజయాన్ని అందించలేకపోయాయి. అఖిల్ ప్రస్తుతం `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందిస్తున్న `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` సినిమాలో నటిస్తున్నాడు. 


గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా తనకు హిట్ అందుతుందని భావిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ నెలలో విడుదల చేయడం కుదరదు. భారత్‌లో పరిస్థితులు చక్కబడినా ఓవర్సీస్‌లో మే నెల చివరి వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు. ఈ సినిమాయే కాదు.. ఈ వేసవిని టార్గెట్ చేసిన అన్ని సినిమాల పరిస్థితీ అగమ్యగోచరంగానే ఉంది. ఈ నేపథ్యంలో తొలి విజయం కోసం అఖిల్ మరింత కాలం వేచి ఉండక తప్పదు. 

Advertisement
Advertisement
Advertisement