అక్కినేని యంగ్ హీరో అఖిల్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయనున్నాడు. స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుందట.
ఇక, తాజాగా అఖిల్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. `ఫ్యామిలీ మేన్` వెబ్ సిరీస్‌తో దేశం మొత్తాన్ని ఆకర్షించిన రాజ్-డికేలతో ఓ సినిమా చేయబోతున్నాడట. వీరిద్దరూ అఖిల్‌తో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నారని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తారట.