30మందికి భోజనం వడ్డించిన ఐశ్వర్య రాయ్

ఐశ్వర్యరాయ్‌కి అందంతో పాటు మంచి మనసుందని బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ విశాల్ దడ్లానీ అంటున్నాడు. ఒకసారి పదుల సంఖ్యలో అందరికి భోజనం ఐష్ వడ్డించిందని అతడు చెబుతున్నాడు. అనంతరం ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. 


అందాల రాణి, నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ ఒకేసారి 30మందికి భోజనం వడ్డించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనను బాలీవుడ్ సింగర్, కంపోజర్ అయిన విశాల్ దడ్లానీ అభిమానులతో పంచుకున్నాడు.  ఒకసారి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, విశాల్ దడ్లానీ తదితరులు కలిసి మ్యూజిక్ టూర్ చేశారు. ఈ సందర్భంగానే ఆమె అందరికి భోజనం వడ్డించిందని అతడు ఒక రియాలిటీ షోలో చెప్పాడు.   


‘‘ మేం అందరం కలిసి దాదాపుగా 30మందితో మ్యూజిక్ టూర్ చేశాం. ఒక రోజు మా టీం అంతా కలిసి బిగ్ బీతో డిన్నర్ చేయాలనుకుంది. ఆ విషయాన్ని అమితాబ్‌కు చెప్పగానే ఒప్పుకున్నారు. అందరం కలిసి డిన్నర్ చేసే రోజు వచ్చింది. పనివారు ఉన్నప్పటికి వారందరిని వద్దని చెప్పి ఐశ్వర్యనే ప్రతి ఒక్కరికి వడ్డించింది. అలా వడ్డించాల్సిన అవసరం ఆమెకు లేదు. అయినప్పటికి ఆ పని చేసింది. ఆమె ప్రచారం కోసం చేయడానికైనా అక్కడ కెమెరాలు లేవు. కానీ, ప్రేమతో 30మందికి ఆమె భోజనం వడ్డించింది’’ అని విశాల్ దడ్లానీ చెప్పాడు. 


‘‘ఆమె కొన్ని ఏళ్లుగా నాకు తెలుసు. ఆ విధంగానే ఆమె ప్రవర్తిస్తుంది. వడ్డించిన అనంతరం అందరికి స్వీట్స్‌ను కూడా అందించింది. అందరు తిన్న తర్వాత మాత్రమే ఆమె భోజనానికి కూర్చుంది. ఆ రోజు ఐశ్వర్యరాయ్ మా అందరికి వడ్డించడంతో భూమి మీద అదృష్టవంతులుగా మేం భావించాం ’’ అని అతడు చెప్పాడు.

Advertisement

Bollywoodమరిన్ని...