Abn logo
Sep 26 2020 @ 04:38AM

రూ.14.20కోట్లు..ఇంటిపన్నుల వసూళ్ల లక్ష్యం

ఈనెల నుంచి గ్రామాలవారీగా స్పెషల్‌ డ్రైవ్‌కు సన్నాహాలు

పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ

ఇప్పటివరకు రూ.4.13కోట్ల వసూలు

మార్చి నెలాఖరులోగా 100శాతం పూర్తిచేసేలా చర్యలు


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : పల్లెల్లో పన్నుల వసూళ్లకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటిపన్నుల వసూళ్లతోపాటు పలు దుకాణాల వృత్తి పరమైన లైసెన్సులను రిన్యూవల్స్‌పై జిల్లా పంచాయతీశాఖ  గ్రామ పంచాయతీల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో గతంలో మొత్తం 61గ్రామపంచాయతీలు ఉన్నాయి. కీసర మండలంలో 9 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అదే విధంగా శామీర్‌పేట్‌లో మండలంలో 10, మూడు చింత లపల్లిలో 13, మేడ్చల్‌లో 17, ఘట్‌కేసర్‌లో 11 గ్రామ పంచా యతీలు ఉన్నాయి. ఇప్పటివరకు రూ.5.50కోట్ల వరకు వసూలు చేశారు. అన్ని గ్రామపంచాయతీల్లోనూ 100శాతం ఆస్తి పన్నులు వసూలు చేయాలన్నది లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.11.10కోట్ల మేరకు నిర్దేశించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 14.20కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది.


ఇప్పటివరకు రూ.4.13కోట్ల వరకు వసూలు చేశారు. మార్చి నెలాఖరు వరకు 100శాతం వసూళ్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పన్నుల వసూళ్లపై ఈవోపీర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో డీపీవో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈనెల నుంచి స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. సాధారణంగా గ్రామపంచాయతీల్లో ఇంటిపన్నులు, గ్రంథాలయ పన్ను, నల్లా బిల్లులు, డిపాజిట్లు, నిర్మాణ అనుమతులు, వ్యాపార లైసెన్సుల ఫీజులు, వేలం పాట రుసుం, ప్రకటనలపై పన్ను, రహదారి రుసుం వసూలు చేస్తారు. వీటిలో ఆస్తి పన్నులు పెద్దఎత్తున వసూలు చేయాల్సి ఉంటుంది. పలు గ్రామాల్లో అపార్ట్‌మెంట్లు (బహుళ అంతస్థుల భవనాలు) వెలిశాయి. వీటితోపాటు ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలలు కూడా ఉన్నాయి. ఇళ్లతోపాటు ప్రైవేట్‌ సంస్థల్లోనూ పన్నులు వసూలు చేసేం దుకు పంచాయతీ శాఖ సన్నాహాలు చేస్తుంది. 2020 మార్చిలోగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతిఒక్కరూ విధిగా ఆస్తి పన్నులు చెల్లించేలా ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, పన్నుల వసూళ్లపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ

ఇళ్లతోపాటు అన్ని ప్రైవేట్‌ సంస్థల యజమానులకు ఆస్తి పన్నులు చెల్లించాలని పంచాయతీ అధికారులు నోటీసులు జారీచేశారు. జిల్లాలోని పలు మండలాల్లో బహుల అంతస్థుల భవనాలు నిర్మించి, ఇంటి పన్నులు చెల్లించడం లేదు. దీంతో ఇళ్లు కట్టుకున్న ఇంటి యాజమానులతోపాటు బిల్డర్ల నుంచి ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు విధిగా గ్రామపంచాయతీల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మండలాల్లో యాజమానులు, పలు కాలనీల్లో ఇళ్లను, ఫ్లాట్లను కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేయించుకుని గ్రామపంచాయతీల్లో నమోదు చేసుకోవడం లేదు. వీటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ఏయే గ్రామాల్లో ఎన్ని బహుళ అంతస్థుల భవనాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన అనుమతితోపాటు, ఇంటి విలువను పరిశీలించారు. జిల్లాలోని మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, కీసర, శామీర్‌పేట్‌, తదితర మండలాల్లోని పలుగ్రామాల్లో బహుళ అంతస్థుల భవనాలు ఉన్నాయి. ఏయే గ్రామాల్లో ఎన్ని ఉన్నాయన్న పూర్తి సమాచారాన్ని సేకరించారు. భవనాల విలువను కూడా అంచనా వేశారు. ఇప్పటివరకు ఇంటిపన్నులు కట్టని యాజమానులకు డిమాండ్‌ నోటీసులు జారీచేసి పన్నులు వసూలు చేశారు. 


పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ  : - డీపీఓ పద్మజారాణి

గ్రామపంచాయతీల్లో ప్రతి సంవత్సరం వసూలు చేసే ఆస్తి పన్నులపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పకడ్బందీగా కార్యాచరణ రూపొం దించాం. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నాం. పన్నులు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ సంస్థలకు డిమాండ్‌ నోటీసులు జారీచేశాం. జిల్లా వ్యాప్తంగా పన్నుల వసూళ్లపై సర్పంచులు, ఈవోఆర్డీలు, పంచా యతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నాం.  

Advertisement
Advertisement
Advertisement