Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో ఆరు వారాలు జాగ్రత్త..!

న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి విషయంలో వచ్చే ఆరు నుంచి  8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరిస్తే  కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు వెళ్లొచ్చని ఎయిమ్స్ పేర్కొంది. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని, అందువల్ల ప్రజలు రాబోయే పండుగల సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలిపారు. వ్యాక్సిన్ రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని అయితే టీకాలు తీసుకున్న వారి ద్వారా వ్యాక్సిన్ తీసుకోని వారికి వైరస్ సోకితే అలాంటి వారిలో తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కోవిడ్ విషయంలో ప్రస్తుతం దేశంలో ఆవావహ పరిస్థితులు ఉన్నాయని, రోజు రోజుకు వైరస్ తిరోగమనంలో సాగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంతో మళ్లీ కేసులను పెంచే పరిస్థితికి తీసుకురాకూడదన్నారు. మహమ్మారి  అంతాన్ని చూడాలనుకున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు గుంపులుగా చేరడం మానుకోవాలని  తెలిపారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement