Abn logo
Sep 27 2020 @ 10:41AM

హైదరాబాద్‌లో రెండో రోజు మాణికం ఠాగూర్ బిజీబిజీ

Kaakateeya

హైదరాబాద్: నగరంలో ఏఐసీసీ ఇంచార్జి మాణికం ఠాగూర్ రెండో రోజు బిజీబిజీగా గడుపనున్నారు. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల‌తో ఈరోజు విడివిడిగా మాణికం సమావేశం అవనున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చ జరుగనుంది. రేపు కేంద్ర నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు తలపెట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులతో సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఠాగూర్ సమావేశంకానున్నారు. 

Advertisement
Advertisement
Advertisement