Abn logo
Aug 7 2020 @ 03:10AM

మనోవేదనతో అగ్రిగోల్డ్‌ బాధితుడు మృతి

తాడికొండ ఆగస్టు 6 : డిపాజిట్‌ చేసిన డబ్బులు ఎంతకూ రావడంలేదనే మనోవేదనతో అగ్రిగోల్డ్‌ బాధితుడు గురువారం మరణించాడు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన మానుకొండ సాంబశివరావు (85) అగ్రిగోల్డ్‌ కంపెనీలో రూ. 1,12,000లు డిపాజిట్‌ చేశాడు. కంపెనీ బోర్డు తిప్పేసిన తరువాత ప్రభుత్వం కల్పించుకొని డిపాజిట్‌దారులకు నగదు చెల్లింపులు చేస్తామని ప్రకటించినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడికి రాలేదు. దీంతో  సాంబశివరావు తీవ్రంగా కలత చెందాడు. పొన్నెకల్లు సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితులు చేసిన నిరసన కార్యక్రమాలలో కూడా మృతుడు పాల్గొని తన బాధను వ్యక్తం చేశాడు. అదే దిగులుతో గురువారం మరణించాడు.

Advertisement
Advertisement
Advertisement