Abn logo
Sep 24 2021 @ 00:14AM

వ్యవసాయ సలహా మండళ్లు కీలక భూమిక పోషించాలి

మాట్లాడుతున్న వ్యవసాయ శాస్త్రవేత్త దాడి ఉమామహేశ్వరరావు

సబ్బవరం, సెప్టెంబరు 23 : రైతాంగాన్ని అన్ని రంగాల్లో చైతన్య పరచడంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులు కీలక భూమిక పోషించాలని కొన్నెంపైడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దాడి ఉమామహేశ్వరరావు సూచించారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి సలహా మండలి సభ్యులు తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌, రానున్న రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు కావలసిన వంగడాలు, నూతన పద్ధతులు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు, వరిలో చీడపీడల నివారణపై సభ్యులకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏడీ ఎం.కోటేశ్వరరావు, అనకాపల్లి రైతు శిక్షణ కేంద్రం శాస్త్రవేత్త టి.దాసు, వీఏఏలు లావణ్య, కిశోర్‌, సలహా మండలి సభ్యులు చీపురుపల్లి సూర్యనారాయణ, సబ్బవరపు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

పరవాడలో..

పరవాడ: ఖరీప్‌ సీజన్‌లో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అనకాపల్లి రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ హరికృష్ణ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం మీటింగ్‌ హాల్లో గురువారం వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌లు, సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేందాల్ర ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను రైతులకు తెలియజేయాలన్నారు. ఉద్యానవన శాఖ అధికారిణి రాధిక మాట్లాడుతూ కూరగాయ పంటల సాగుపై మెళకువలు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్‌ కోన రామారావు, మండల వ్యవసాయాధికారిణి సీహెచ్‌ చంద్రావతి, పశువైద్యాధికారిణి అశ్విన్‌, ఏఈవోలు సంజీవరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.