Abn logo
Sep 24 2020 @ 13:11PM

పంజాబ్ లో ప్రారంభమైన ‘రైల్ రోకో’.. మూడు రోజుల పాటు నిలిచిపోనున్న రైళ్లు

Kaakateeya

పంజాబ్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ లో రైలు రోకోలు ప్రారంభమయ్యాయి. 24 తేదీ (గురువారం) నుంచి 26 వ తేదీ (శనివారం) వరకూ ఈ రైల్ రోకోను నిర్వహిస్తామని రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ముందే ప్రకటించిన 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.


మరోవైపు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు సత్‌నాం సింగ్ మాట్లాడుతూ... తమ నిరసన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనాలని తాము కోరామని, ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు అనుకూలంగా వ్యవహరించిన బీజేపీ ప్రజా ప్రతినిధులను సామాజికంగా బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement