Abn logo
Aug 6 2020 @ 23:35PM

ఏజెంట్‌ వినోద్‌ ఎవరు?

ఓవైపు ప్రపంచ చిత్రపటం, దానిపై గన్‌... మరోవైపు పుస్తకాలు, దానిపై పాతకాలపు తాళం చెవులు... పైన టైప్‌ రైటర్‌, ఓ లాంతర్‌, కెమెరా... వీటిపై రక్తపు మరకలు, దానిపై ఓ వ్యక్తి నీడ... గురువారం విడుదలైన ‘ఏజెంట్‌ వినోద్‌’ ప్రీ-లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని నిర్మాత అభిషేక్‌ నామా అన్నారు. నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ‘‘ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌. వింటేజ్‌ స్పై డిటెక్టివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం. ఓ యువ కథానాయకుడు టైటిల్‌ రోల్‌ పోషించారు. అతనెవరో తెలుసుకోవాలంటే ఫస్ట్‌లుక్‌ విడుదల వరకూ ఎదురుచూడక తప్పదు. ప్రీ-లుక్‌లో నీడ ఎవరైనా నేరస్తుడిదా? ఏజెంట్‌ వినోద్‌దా? అసలు, ఏజెంట్‌ వినోద్‌ ఎవరు? అనేది ఆసక్తికరం’’ అని దర్శకుడు అన్నారు. దేవాన్ష్‌ నామా, రవి పుట్టా సమర్పిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement
Advertisement