Abn logo
Mar 25 2020 @ 20:54PM

క‌రోనా వైర‌స్ పోరాటం.. 6 సూచ‌న‌లు చేసిన మ‌హేశ్‌

క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు లాక్ డౌన్‌ను ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ తార‌లు ప‌లువురు క‌రోనా నివార‌ణ కోసం ప‌లు జాగ్ర‌త్త‌లను సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ మహేశ్ ట్విట్ట‌ర్ ద్వారా కొన్ని సూచ‌న‌లు చేశారు. 


మ‌హేశ్ చెప్పిన 6 సూచ‌న‌లు:


1. ఇంట్లోనే ఉండాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట అడుగు పెట్టాలి. 


2. రోజులో చాలా సార్లు స‌బ్బుతో 20-30 సెక‌న్ల పాటు చేతుల‌ను క‌డుగుకోవాలి. 


3. మీ ముఖాన్ని చేతుల‌తో తాకవ‌ద్దు. ముఖ్యంగా క‌ళ్లు, ముక్కు, నోటి బాగాల‌ను తాక‌రాదు.


4. ద‌గ్గుతున్న‌ప్పుడు, తుమ్ముతున్న‌ప్పుడు మీ ముఖానికి మో చేతులు లేదా టిష్యూని అడ్డం పెట్టుకోండి


5. సామాజిక దూరం యొక్క అవ‌స‌రాన్ని గుర్తించండి. ఇంట్లో, బ‌య‌ట ఇత‌రుల‌తో మూడు మీట‌ర్ల దూరం పాటించండి


6. మీకు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటేనే మాస్కును ఉప‌యోగించండి. మీకు కోవిడ్ 19 ల‌క్ష‌ణాలుంటే డాక్ట‌ర్ని సంప్ర‌దించండి


మ‌హేశ్ ఉగాది శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ ఈ సూచ‌న‌లు చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసిన సూచ‌న‌లు పాటించాలని, మంచి సోర్సు ద్వారా వ‌చ్చే స‌మాచారాన్ని మాత్ర‌మే న‌మ్మాల‌ని, కరోనాపై పోరాడాల‌ని ఆయ‌న సూచించారు. 


Advertisement
Advertisement
Advertisement