Abn logo
May 26 2020 @ 22:02PM

మరోసారి మెగాఫోన్ కోసం టాప్ రచయిత ప్రయత్నాలు

స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ అందరికీ సుపరిచితమే. రాజమౌళి సక్సెస్ వెనుక ఉన్న మెయిస్ హస్తంగానే కాకుండా, రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఆయన పొందారు. ఆయన నుంచి స్ర్కిప్ట్ వస్తుందంటే ఖచ్చితంగా అది సంచలనమే అనేంతగా ఆయన ఈ మధ్య తన పెన్ పవర్ చూపించారు. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్ ‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంచి చిత్రాలకు కూడా స్ర్కిప్ట్ అందించింది ఆయనే. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రానికి కూడా ఆయన రచయిత. అయితే రచయితగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న విజయేంద్రప్రసాద్, డైరెక్టర్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఆయన ఇప్పటి వరకు 4 చిత్రాలకు దర్శకత్వం అందించారు. కానీ ఏదీ ఆయనకు దర్శకుడిగా సరైన గుర్తింపును ఇవ్వలేదు.


మరోసారి ఆయన తన దర్శకత్వ ప్రతిభను పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ఇప్పటి వరకు ‘అర్థాంగి, శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఇప్పుడు ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాక్. దీనికోసం కథ కూడా సిద్ధం చేసుకున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని కూడా వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఈ స్టార్ రచయిత స్పందించాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement