Advertisement
Advertisement
Abn logo
Advertisement

Chittoor : రామకుప్పంలో మళ్లీ శబ్దాలు, భూప్రకంపనలు

చిత్తూరు జిల్లా/రామకుప్పం : రామకుప్పం మండలంలో అంతుచిక్కని శబ్దాలు, భూప్రకంపనల పరంపర కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి మండల పరిధి గడ్డూరు, గెరిగెపల్లె, యానాది కాలనీ, కృష్ణానగర్‌, గొరివి మాకులపల్లె, పెద్దగెరిగెపల్లెల్లో నాలుగైదుమార్లు శబ్దాలు, భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి జాగారం చేశారు. పలుచోట్ల గోడలకు బీటలు రావడం, ఇళ్లలో వస్తువులు కిందకు దొర్లాయని వారు తెలిపారు. స్థానికంగా ఉన్న క్వారీల వల్ల శబ్దాలు, భూప్రకంపనలు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం అధికవర్షాల వల్ల భూమిలోపల జలాలు ఇంకుతుండటం వల్ల శబ్దాలు, భూప్రకంపనలు వస్తున్నాయని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో శబ్దాలు, భూప్రకంపనలకు అసలు కారణాలను శోధించి, భయాందోళనలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement