Abn logo
Sep 21 2021 @ 15:15PM

ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ భార్య పెద్ద కథే నడిపింది.. ఇంట్లోనే భర్తను చంపి కెమికల్స్‌తో మాయ చేసి..

ఇంటర్నెట్ డెస్క్: గదిలో ఓ భారీ డ్రమ్. అందులో ఓ వ్యక్తి మృత దేహం. ఆమె ఆ మృతదేహాన్ని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. ఇందుకోసం డ్రమ్ములో యూరియా, ఉప్పు, యాసిడ్ పోసి ఆ మిశ్రమంలో మృత దేహాన్ని కరిగించేయాలనుకుంది. నాలుగు రోజుల పాటు శవాన్నీ ఆ మిశ్రమంలోనే పెట్టింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఈ క్రమంలో డ్రమ్ములోంచి ప్రమాదకర వాయువులు వెలువడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో.. యువతి బాగోతం మొత్తం బయటపడిపోయింది. హారర్, క్రైమ్ థిల్లర్ సినిమాలను మించిపోయేలా నిందితురాలు రచించిన పథకం చూసి స్థానికులు నోరేళ్లబెడుతున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. 

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధ అనే మహిళ  ప్రియుడితో కలిసి తన భర్త రాకేశ్ సాహ్నీని వదిలించుకునేందుకు జరిగిన ప్రయత్నమే ఈ పేలుడుకు దారితీసిందని పోలీసులు తేల్చారు. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించాక..అతడి మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా వదిలించుకోవాలని ఆమె తన ప్రియుడితో కలిసి ఈ పథకం పన్నింది.  గదిలోంచి దుర్వాసన రాకుండా కిటికీలు, వెంటిలేటర్లలో దుస్తులు కుక్కింది. అన్ని చోట్లా అతరబత్తీలు వెలిగించింది. ఆ తరువాత.. భర్త మృతదేహాన్ని ముక్కలు చేసి వాటిని రసాయాలు ఉన్న డ్రమ్ములో పెట్టింది. ఈ క్రమంలో జరిగిన రసాయనిక చర్యల కారణంగా ప్రమాదకర వాయువులు వెలువడ్డాయి. అప్పటికే అక్కడ ఉన్న అగరబత్తీల కారణంగా అగ్గి రాజుకుని పేలుడు సంభవించింది. అమోనియం నైట్రేట్ వాయువుకు నిప్పంటుకోవడంతో ఇది సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

మృతుడి సోదరుడు దినేష్ సాహ్ని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాకేశ్ భార్య రాధతో పాటూ ఆమె ప్రియుడు సుభాష్, రాధ మరదలు, ఆమె భర్త వికాస్ పేర్లను ప్రధాన నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితురాలు తన భర్త గొంతు కోసి హత్య చేసి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. కాగా.. రాకేశ్ ఆరురోజుల నుంచి కనిపించడం లేదంటూ దినేశ్ పోలీసులకు తెలిపాడు. నిందుతుల కోసం పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

ప్రత్యేకంమరిన్ని...