Abn logo
Sep 22 2021 @ 10:07AM

Spain: కానరీ దీవుల్లో ఈతకొలనును ముంచెత్తిన లావా

50 ఏళ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం 

లా పాల్మా (స్పెయిన్): స్పెయిన్ దేశంలోని కానరీ దీవుల్లోని లా పాల్మా అగ్నిపర్వతం పేలుడుతో వెలువడిన లావా ఈతకొలనును ముంచెత్తింది. స్పానిష్ కానరీ దీవుల్లో 1971 వ సంవత్సరం తర్వాత అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. అగ్నిపర్వతం నుంచి వెదజల్లుతున్న లావాను డ్రోన్ ఫుటేజ్ తాజాగా వెలుగుచూసింది. లావా ప్రవాహం స్విమ్మింగ్ పూల్ ను ముంచెత్తిన వీడియో వైరల్ అయింది. అగ్నిపర్వతం పేలుడు అనంతరం లావా ప్రవాహం వల్ల 100 ఇళ్లు ధ్వంసం కాగా, 5,500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అగ్నిపర్వతం పేలుడు ఘటన చూసి భూకంపం వచ్చిందని భావించామని ఆస్ట్రియాకు చెందిన ఎవా అనే టూరిస్టు చెప్పారు. 


ఇవి కూడా చదవండిImage Caption