Abn logo
Aug 1 2021 @ 23:43PM

ఎంపీ నిధులకు పరిపాలన అనుమతులు

బిల్లగుంటలో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించే స్థలం

 తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి రూ. 49 లక్షలు

  ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం 


 (తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

 తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మంజూరైన ఎంపీ ల్యాడ్స్‌ నిధులపై ఎట్టకేలకు పంచాయతీ రాజ్‌ అధికారు లు స్పందించారు. అంచనాలు రూపొం దించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమ ర్పించారు. ఎంపీ నిధులపై వివక్ష అనే శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో అధికా రులు స్పందించారు. ఎంపీ నిధులపై జిల్లా కలెక్టర్‌ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఆరు నెలలనుంచి ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దిశగా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పంచాయతీల్లో పనులు చేపట్టాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎంపీ రఘురామకృష్ణ ంరాజు తొలుత రూ.54 లక్షలు మంజూరు చేశారు. మాధవరం పంచాయతీలో రూ.5 లక్షల విలువైన పనులు అర్హత సాధించలేదు. సీసీ రహదారులు, కమ్యూనిటీ భవనాలు, స్కూల్‌ భవనాల నిర్మాణానికి ఎంపీ నిధులు వినియో గించాల్సి ఉంటుంది. మాధవరంలో వేరే అవసరాలకోసం ప్రతిపాదించడంతో కలెక్టర్‌ పరిపాలన అనుమతి ఇవ్వలేదు. మిగిలిన పంచాయతీల్లో  రూ.49 లక్షల విలు వైన పనులకు అనుమతులు మంజూరు చేశారు. పెంటపాడు మండలంలో దర్శిపర్రు పంచాయతీలోని బిల్లగుంటలో రూ.10 లక్షల తో  ప్రాథమిక పాఠశాల భవనం, యానాల పల్లిలో రూ.5 లక్షలతో సీసీ రహదారిని నిర్మి ంచనున్నారు. ముదునూరు, వల్లూరపల్లి గ్రామ పంచాయతీల్లోని శ్మశాన వాటికల్లో సౌకర్యాలకోసం చెరో రూ.5 లక్షలు వెచ్చిం చనున్నారు. తాడేపల్లిగూడెం రూరల్‌ మండ లంలో ఆరుగొలను, కొత్తూరులో  శ్మశాన వాటికల అభివృద్ధికి చెరో రూ.5 లక్షలతో పనులు చేపట్టనున్నారు. అప్పారావుపేట, నవాబుపాలెంలో  రూ.10 లక్షలతో సీసీ రహదారులు ఏర్పాటు చేయనున్నారు. సకాలంలో వీటిని పూర్తి చేస్తే ఎంపీ ల్యాడ్స్‌ నుంచి మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గానికి నిధులు కేటాయించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు, పరిపాలన అనుమతులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్‌కు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ కృత జ్ఞతలు తెలిపారు.