విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న హీరో అడవి శేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తున్న `మేజర్` సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన `హిట్` సీక్వెల్లో నటించే ఛాన్స్ అడవి శేష్‌ను తాజాగా వరించిందట.
తొలి సినిమాలో నటించిన విష్వక్సేన్ ఈ సీక్వెల్లో నటించడం లేదని తాజా సమాచారం. దర్శకుడు సైలేష్ కొలను ఇప్పటికే సీక్వెల్ కథను సిద్ధం చేశాడని, అడవి శేష్‌కు వినిపించాడని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.