Abn logo
Apr 6 2020 @ 19:20PM

రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి ఇకలేరు

దివంగత కనకాల దేవదాసు కుమార్తె, నటుడు రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతూ సోమవారం హైటెక్ సిటీలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయుర్వేద వైద్య నిపుణురాలు అయిన ఆమె గత రెండు సంవత్సరాలుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రచయిత, పాత్రికేయులు అయిన పెద్ది రామారావు ఆమె భర్త. వీరికి ఇద్దరు అమ్మాయిలు. కొన్నాళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తల్లిదండ్రులకు తగ్గ తనయగా గుర్తింపు పొందిన ఆమె వయసు 40 సంవత్సరాలు. చిన్న వయసులోనే క్యాన్సర్ మహమ్మారి‌తో పోరాడి కనుమూసిన శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన అందరూ నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.



Advertisement
Advertisement
Advertisement