Abn logo
May 22 2020 @ 21:37PM

సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమే: ఉత్తేజ్

ప్రసిద్ధ సినీ కవి సుద్దాల అశోక్ తేజ ఆరోగ్య విషయమై రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, అశోక్ తేజ కుటుంబ సభ్యులు ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే.. ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ వార్తలు పుట్టిస్తున్నారనే వార్త బుధవారం సాయంత్రం వినిపించింది. అయితే సుద్దాల అశోక్ తేజకే ఆరోగ్యం బాగా లేదని, ఆయనకి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగనున్నట్లుగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజకి వరసకి అల్లుడైన్ ఉత్తేజ్ ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై వివరణ ఇస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.


ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నమస్తే.. సుద్దాల అశోక్ తేజగారు మా మామయ్య. లిరిసిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. తను అనారోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తుంది. అది నిజమే. అయితే ఆయన ఈరోజు(మే 22) హాస్పటల్‌లో జాయిన్ అవుతున్నారు. రేపు (23) సాయంత్రం సర్జరీ ఉంది. తన ఫ్రెండ్‌తో మాటమాత్రంగా బ్లడ్ అవసరం ఉంటుందేమో అని చెబితే.. ఆ ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో పెట్టేశాడు. దానితో టోటల్ సోషల్ మీడియా మొత్తం మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా రాస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. బ్లడ్ అవసరం ఉండింది. వెంటనే నేను చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్‌కు ఫోన్ చేయడం, అక్కడ స్వామినాయుడుగారు, ముఖేష్‌గారు వెంటనే రియాక్ట్ అయ్యి, బ్లడ్ డొనేటర్స్‌ని పంపించడం కూడా జరుగుతుంది. మామయ్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిగారు, అన్నయ్య.. ఈ విషయం తెలిసిన వెంటనే మార్నింగ్ నాకు ఫోన్ చేసి మామయ్యకు ఎలా ఉందని కనుక్కుని, వీలైతే మామయ్యతో మాట్లాడించు అని చెప్పారు. నేను వెంటనే మామయ్యతో అన్నయ్య చిరంజీవితో మాట్లాడించాను. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని కలిగించాయి. టోటల్ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా, ఎంతో ధైర్యంగా హాస్పటల్‌కు వెళుతున్నానురా.. అని మామయ్య చెప్పారు. అన్నయ్య సహృదయతకు కృతజ్ఞుడిని. సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనందరి అభిమానం, ప్రేమతో ఆయన హ్యాపీగా బయటికి వచ్చి మళ్లీ బోలెడన్ని పాటలు రాస్తారని కోరుకుందాం..’’ అని తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement