Jul 30 2021 @ 17:15PM

ఇంట్లో వ్యాయామం చేస్తూ జారిపడిన సీనియర్ హీరో

సీనియర్‌ హీరో, రాజకీయ నేత కార్తీక్‌ తన ఇంట్లో జారిపడ్డారు. వ్యాయామం చేస్తుండగా పట్టుకోల్పోయి కిందపడ్డారు. దీంతో ఆయన కాలి ఎముకలో సన్నటి క్రాక్‌ ఏర్పడినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఈయన రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి హిందీ అంథాధున్‌ తమిళ రీమేక్‌తో పాటు తిరుపూరుకు చెందిన దర్శకుడు టీఎం జయమురుగన్‌ తెరకెక్కించే చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల షూటింగులో పాల్గొనేందుకు సిద్ధమయ్యేందుకు ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కాలుజారి పడ్డారు. ఆ వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ఎక్స్‌రే తీయగా, కాలి ఎముకలో చిన్నపాటి క్రాక్‌ ఏర్పడినట్టు వైద్యులు గుర్తించి, చికిత్స అందిస్తున్నారు. అంతకు ముందు కూడా కార్తీక్ తీవ్ర అనారోగ్యం కారణంగా హాస్పటల్ పాలైనట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Otherwoodsమరిన్ని...