Advertisement
Advertisement
Abn logo
Advertisement

నటి చౌరాసియాపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదు: పోలీసులు

హైదరాబాద్: నగరంలోని కేబీఆర్‌ పార్క్ వద్ద నటి చౌరాసియాపై జరిగిన దాడి కేసుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. నటి చౌరాసియాపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని స్పష్టం చేశారు. కేవలం సెల్‌ఫోన్ దొంగలించడం కోసమే ఆమెపై దాడి చేశాడన్నారు. సీసీ  కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకపోవడంతో పరిసర ప్రాంతాల కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.  నటిపై అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎంత వీలైతే అంత తొందరగా నిందితున్ని పట్టుకొనే ప్రయత్నం చేస్తామని పోలీసులు తెలిపారు. 


కొనసాగుతున్న విచారణ...

మరోవైపు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. పార్క్‌లో నటి చౌరాసియా వాక్  చేస్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేసి సెల్‌ఫోన్‌లో లాక్కెళ్లాడు. ఈ క్రమంలో దొంగతో జరిగిన పెనుగులాటలో నటి చౌరాసియాకు చిన్నపాటి గాయాలయ్యాయి. గతంలో అదే ప్రాంతంలో ఓ మహిళను ఆగంతకులు బెదిరించిన విషయం తెలిసిందే. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వరుసగా దారి దోపిడీలు జరుగుతున్నాయి. నటి చౌరాసియాపై దాడి జరిగిన తర్వాత నిందితుడు సెల్ ఫోన్‌తో పాటు కేబీఆర్‌ పార్క్‌లోకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement