Oct 22 2021 @ 21:03PM

నిన్న రావణుడు.... నేడు గుహుడు...

సీనియర్ నటుడు చంద్రకాంత్ పాండ్య గురువారం మరణించారు. ఆయన వయస్సు 72 ఏళ్లు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీరియల్లో ఆయన నిషాద రాజు ‘గుహు’ని పాత్ర పోషించారు. ఆ క్యారెక్టర్‌తో బాగా ఫేమస్ అయిన చంద్రకాంత్, ‘మజహ్దార్, ప్యార్ హో గయా, హోతే హోతే ప్యార్ హో గయా’ లాంటి పలు బాలీవుడ్ సినిమాల్లోనూ అలరించారు. 


‘రామాయణం’ సీరియల్లో ప్రతిష్ఠాత్మక ‘రావణాసురుడి’ పాత్ర పోషించిన మరో నటుడు అరవింద్ త్రివేది కూడా ఈ మధ్యే మృత్యువాత పడ్డారు. ఆయన కూడా వయస్సు రిత్యా ఎదురైన అనారోగ్య కారణాల వల్ల ఇదే నెలలో తుది శ్వాస విడిచారు. వెంటవెంటనే, ‘రావణాసురుడు, గుహుడు’ పాత్రలు పోషించిన ప్రఖ్యాత నటులు మరణించటంతో చాలా మంది ప్రేక్షకులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు...    

Bollywoodమరిన్ని...