Abn logo
Oct 14 2021 @ 00:31AM

ప్లాస్టిక్‌ కవర్లను అమ్మితే చర్యలు తప్పవు

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 13: కామారెడ్డి పట్టణంలో 75 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు అమ్మ కం జరిపితే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం జారీ చేసిన జీఎస్‌ఆర్‌ 571(బీ) నిబంధనలను అందరూ పాటించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లాస్టిక్‌ వస్తువుల అమ్మ కం, వినియోగంను నిషేధించేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టి క్‌ వస్తువులు, కవర్లు విక్రయించడం, ఉపయోగిస్తే 96400 50750, 98499 07823, 86881 10983 నెంబర్లకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో సింగిల్‌యూజ్‌డ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను అమ్మ కాలు జరిపితే మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ జగ్జీవన్‌ తెలిపారు. 75 మైక్రాన్ల మందంకంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు అమ్మకం జరిపితే చర్యలు తప్పవని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లాస్టిక్‌ వస్తువుల అమ్మకం, వినియోగాన్ని నిషేధించేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లను వినియోగిస్తే 91829 90414 నెంబర్లకు ఫోన్‌ ద్వారా ఫిర్యా దు చేయవచ్చని తెలిపారు.