Abn logo
Sep 26 2020 @ 04:50AM

ఇన్‌స్పైర్‌ నామినేషన్లు పూర్తిచేయనివారిపై చర్యలు

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 25: ఇన్‌స్పైర్‌ అవార్డుల నామినేషన్‌ గడువు ఐదు రోజులే ఉందని, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు నామినేషన్లు పూర్తిచేయాలని డీఈవో కె.నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 30 లోపు ఇన్‌స్పైర్‌ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని డీఈవో ఆదేశించారు. 

Advertisement
Advertisement
Advertisement