Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం దక్షిణప్రాంత కార్యదర్శి ఇంతియాజ్‌ 

పెనుకొండ, డిసెంబరు 2:  రైతులపట్ల బెదిరింపులకు పాల్పడుతున్న వా రిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం దక్షిణప్రాంత కార్యదర్శి కార్యదర్శి ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామానికి  చెందిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్‌ క లెక్టర్‌  కార్యాలయం ఎదుట వంటా వార్పు నిర్వహించారు. వీరికి ఇంతియాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సీపీఎం నా యకులు హరి, రమేష్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ బెల్‌, నాసెన కంపెనీలకు సంబంధించి భూములు తీసుకున్న ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తిస్థాయి నష్టపరిహారం, పునరావాసం కల్పించలేదన్నారు. పరిశ్రమలు నెలకొల్పలేదని భూ ములన్నీ బీడుగా ఉన్నాయన్నారు. దీంతో ఆయా భూముల్లో వ్యవసాయ  పనులకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు పట్ల బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కా ర్యాలయం ముందే వంటావార్పు చేపట్టారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ నవీనకు వినతిపత్రం అందజేశారు. 15వ తేదీలోపు ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని సబ్‌ కలెక్టర్‌ నవీన రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరి, బ్యాళ్ల అంజి, పెద్దన్న, కదిరప్ప, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, కిరణ్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా నాయకులు వీరేష్‌; రాజగోపాల్‌, చాంద్‌ బాష పాల్గొన్నారు.

Advertisement
Advertisement