Abn logo
May 19 2020 @ 05:00AM

పీఈటీపై చర్యలు తీసుకోవాలి

జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వినతి


గద్వాల క్రైం, మే 18 : అక్రమదందాలు చేస్తున్న పీఈటీపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జైపాల్‌రెడ్డి సోమవారం జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.


అయిజ మండల కేంద్రంలోని జడ్ప్జీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న సదరు పీఈటీ గద్వాల మండలం జమ్మిచేడులో ఉన్న జడ్పీ హెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై వచ్చారన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌లో కూడా ఫిర్యాదు చేశామని, దీనిపై పూర్తిగా విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. 

Advertisement
Advertisement