Abn logo
Sep 18 2021 @ 00:34AM

వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు..

చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషం

వైసీపీ నాయకులపై కందికుంట ఫైర్‌

కదిరి, సెప్టెంబరు 17: వైసీపీ నాయకులు వీధి రౌడీల్లా వ్యవహ రిస్తున్నారని ఇందుకు నిదర్శనం ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై ఎమ్మెల్యే జోగిరమేష్‌, అతని అనుచరులు దాడి చేయడమేనని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయడం అమానుషమన్నారు. ప్రత్యక్షంగా కర్రలు, రాడ్‌లతో దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే జోగిరమేష్‌ జోకర్‌ రమేష్‌లా ప్రవర్తిస్తున్నారన్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో అనేకమార్లు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నోటికి వచ్చినట్లు మా ట్లాడటం మరచిపోయారా అంటూ మండిపడ్డారు. ఇదే విషయం పై అప్పట్లో కదిరిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను టీడీపీ నాయకులు అడ్డుకుంటుంటే పార్టీ హైకమాండ్‌ అడ్డుకోవద్దని చెప్పారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రైతు సదస్సులో మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆ మాటలకు అయ్యన్నపాత్రుడు కట్టుబడి ఉన్నారన్నారు. జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి చేయడం పై డీజీపీ ఏరకంగా తీసుకుంటారో అర్థం కాలేదన్నారు. ఎమ్మెల్యే , కార్యకర్తలతో కలసి రాళ్ళు, రాడ్లు తీసుకుని ఇంటి పైకి వెళ్తుంటే పోలీసు లు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ రౌడీయిజానికి భయపడే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓబుళరెడ్డి, రాజ్‌కుమార్‌నాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.