Oct 14 2021 @ 07:45AM

Acharya: హిందీ వెర్షన్ కూడా రెడీ అవుతుందా..?

మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. ఈ మూవీ హిందీ వెర్షన్ కూడా రెడీ అవుతుందని తాజా సమాచారం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా పాన్ ఇండియన్స్ సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందీ మార్కెట్‌పై మన హీరోలు పట్టు సాధించాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగులో నిర్మిస్తున్న దాదాపు అన్నీ సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే చిరు, చరణ్‌ల 'ఆచార్య' కూడా హిందీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్, తారక్ కలిసి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లో 10 భాషలలో 2022, జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత పాన్ ఇండియన్ లెవెల్లో చరణ్ మార్కెట్ ఖచ్చితంగా విస్తరిస్తుంది. మరీ ముఖ్యంగా హిందీ మార్కెట్ బాగా పెరుగుతుంది. ఈ కారణంగానే 'ఆచార్య' సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారట.