Advertisement

'ఆచార్య': ఓటిటి డీల్ క్లోజ్..!

'ఆచార్య' ఓటిటి డీల్ క్లోజ్ అయిందని తాజా సమాచారం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 200, ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోవారు దక్కించుకున్నటు లేటెస్ట్ అప్‌డేట్. థియేట్రికల్ రిలీజ్ అయిన కొన్ని వారాలకు 'ఆచార్య' మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుందట. ఇక ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడు. 

Advertisement
Advertisement