Abn logo
Mar 30 2020 @ 10:02AM

‘ఆచార్య’ ప‌స్ట్ లుక్ డేట్‌!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ్రీరామ‌న‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఉగాది సందర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుదల చేద్దామని భావించినప్పటికీ అదే రోెజున చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం.. చరణ్ భాగమైన ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ విడుదల కావడంతో చిరు త‌న ఆలోచనను మానుకున్నారట. ఇప్పుడు శ్రీరామినవమి రోజున ఫస్ట్ లుక్‌తో మెగాస్టార్‌ సంద‌డి చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ సినిమాను ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుందేమో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement