Abn logo
Jul 14 2020 @ 14:10PM

ఆచార్య: కీర్తినా? కియారనా?

`ఆర్ఆర్ఆర్` వాయిదా పడడంతో మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య`కు లైన్ క్లియర్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య`లో చిరంజీవితో పాటు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వాయిదా పడడంతో `ఆచార్య`కు చెర్రీ డేట్లు కేటాయించాడట. 


చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, చెర్రీ సరసన హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్, కియార ఆడ్వాణీ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిద్దరిలో ఎవరో ఒకరు చెర్రీ సరసన కనిపించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుందట.


Advertisement
Advertisement
Advertisement