Abn logo
Aug 2 2021 @ 00:06AM

ఆచంట సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడిగా సుంకర సీతారాం

సుంకర సీతారాంను అభినందిస్తున్న సర్పంచ్‌లు

ఆచంట, ఆగస్టు 1 : ఆచంట మండల సర్పంచ్‌ల చాంబర్‌ అఽధ్యక్షుడిగా కొడమంచిలి సర్పం చ్‌ సుంకర సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. స్థానిక మం డల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడిగా సుంకర సీతారాం, ఉపాఽధ్యక్షురాలిగా కరుగోరుమిల్లి సర్పంచ్‌ అల్లం పద్మావతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సమావేశంలో సర్పంచ్‌లు నేలపూడి బేబి, గణేశుల శేషవాణి, బోడపాటి బుల్లియ్య, గుబ్బల మాధవరావు, యడ్ల ప్రసాద్‌, పెచ్చెట్టి కనకదుర్గ,చంటి పాల్గొన్నారు.