Abn logo
Dec 1 2020 @ 23:54PM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

ఘట్‌కేసర్‌ రూరల్‌: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందిన ఘటనలు ఘట్‌కేసర్‌, శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిల్లో మంగళవారం చోటుచేసుకున్నాయి. ఘట్‌కేసర్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో తీవగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మునిసిపాలిటీ అన్నోజిగూడ రాజీవ్‌గృహకల్పకు చెందిన పిడమర్తి సురేష్‌(55) వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయరహదారి ఎన్టీపీసీ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి రోడ్డుదాటుతున్నాడు. ఈ క్రమంలో ఉప్పల్‌వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో సురేష్‌ తలకు తీవ్రమైన గాయమైంది. స్థానికులు గమనించి జోడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే సురేష్‌ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు తెలిపారు. 


కంపెనీ బస్సు ఢీకొని వ్యక్తి.. 


శామీర్‌పేట:  శామీర్‌పేటలో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ఓ కంపెనీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్‌(28)కు భార్య స్వప్న, 6నెలల కొడుకు ఉన్నారు. మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌ పరిధిలో బీఈ  ఫార్మా కంపెనీలో అనీల్‌కుమార్‌ గత కొన్నాళ్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా రోజూలాగే బీఈ కంపెనీకి మంగళవారం మధ్యాహ్నం బైక్‌పై జగదేవ్‌పూర్‌ నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో కొల్తూర్‌ వైన్స్‌ సమీపంలో జోధా కంపెనీకి చెందిన ప్రైవేటు బస్సు ఎదురుగా ప్రమాదవశాత్తు అనిల్‌కుమార్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్‌కుమార్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement