Abn logo
Sep 17 2021 @ 01:11AM

అభ్యంతరాల స్వీకరణ

బత్తలపల్లి, సెప్టెంబరు16: రీసర్వేచేసిన పొలాల్లో అభ్యంత రాలు తెలిపిన రైతులకు మరోసారి కొలిచి మీ అభ్యంతరాలను ని వృత్తి చేస్తామని ఆర్డీఓ రవీంద్ర తెలిపారు. మండలంలోని చెన్న రాయు నిపట్నం గ్రామంలో గురువారం రీసర్వేపై 45మంది రైతులు అభ్యంతరాలను అధికారులకు విన్నవిం చుకున్నారు. ఈ సంద ర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ రీసర్వేలో ఆమోదం పొందిన రైతులు అంగీకారం పత్రంలో సంతకాలు చేయాలన్నారు. అభ్యంత రాలు ఉన్న రైతుల భూములు మరోసారి సర్వే చేస్తామన్నారు. రీస ర్వే పట్ల ఎవ్వరూ ఆపోహాలు పెట్టుకోవద్దని తెలిపారు. సర్వేచేసి హ ద్దులు చూపించిన తర్వాత ఫామ్‌-54అంగీకారపత్రం అందజే యడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఐ నాగప్ప, తహ సీల్దార్‌ ఖుప్రా, ఆర్‌ఐ చక్రఫాణి, వీఆర్‌ఓ శీరీష, గ్రామసర్వేయర్‌ కల్పన తదితరులు పాల్గొన్నారు.