Abn logo
Sep 22 2021 @ 01:03AM

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి: కలెక్టర్‌

సమావేశంలో ప్రసంగిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాలులో గృహ నిర్మాణంపై సమీక్షించారు. జిల్లాలో 1.01 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా, 6961 రూఫ్‌ లెవల్‌ స్థాయికి చేరాయన్నారు. ఇందుకోసం రూ.174.81 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణం కోసం మహిళలకు ఎస్‌హెచ్‌జీ సంఘాల ద్వారా రూ.78 కోట్లు రుణ సౌకర్యం అందించినట్లు చెప్పారు. జేసీ వెంకటేశ్వర్‌, ట్రైనీ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, హౌసింగ్‌ పీడీ పద్మనాభం, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.