Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏసీబీ కోర్టులో ధూళిపాళ్ల కేసుపై విచారణ

విజయవాడ: ఏసీబీ కోర్టులో సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కేసుపై విచారణ జరిపారు. ధూళిపాళ్లను కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలైంది. రెండు పిటిషన్స్‌పై శుక్రవారానికి జిల్లా కోర్టు వాయిదా వేసింది. 


ఇప్పటికే ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. డెయిరీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అరెస్టు చేసినట్టు శుక్రవారం విజయవాడ ఏసీబీ విభాగం అధికారులు ప్రకటించారు. అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు, ధూళిపాళ్ల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. అక్రమంగా ఎందుకు అరెస్టు చేస్తున్నారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. డెయిరీలో అవకతవకలపై ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేస్తున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది.


Advertisement
Advertisement